వైసీపీ ఎమ్మెల్యేలు కాలర్ ఎగరేసుకుని తిరగడం కాదు.. జనాలు వారి కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తున్నారు: చంద్రబాబు

  • వైసీపీ పాలనపై గడపగడపలో వ్యతిరేకత వ్యక్తమవుతోందన్న బాబు 
  • ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వంలో అసహనం వ్యక్తమవుతోందని వ్యాఖ్య 
  • ప్రశ్నించేవారిపై కేసు పెట్టాలనుకుంటే.. 5 కోట్ల మందిపై కేసులు పెట్టాల్సి ఉంటుందన్న బాబు 
వైసీపీ ప్రభుత్వ పాలనపై గడపగడపలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కాలర్ ఎగరేసుకుని ఎమ్మెల్యేలు తిరగడం కాదు... జనం వారి కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తున్నారని చెప్పారు. సంక్షేమంలో కోతలు, అభివృద్ధి పనులపై ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వం అసహనానికి లోనవుతోందని అన్నారు.

 పాలనను ప్రశ్నించిన ప్రతి వారిపై కేసు పెట్టాలి అని ఈ ప్రభుత్వం భావిస్తే... రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందిపైనా జగన్ కేసులు పెట్టాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. వేపనపల్లి గ్రామంలో ఘటనకు వైసీపీ క్షమాపణ చెప్పి విద్యార్థిపై, అతనికి మద్దతుగా నిలిచిన గ్రామస్థులు, టీడీపీ నేతలపై పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే అందరినీ విడుదల చెయ్యాలని అన్నారు. స్థానిక పోలీసుల అత్యుత్సాహంపై డీజీపీ చర్యలు తీసుకోవాలని కోరారు.


More Telugu News