హైబీపీ తన భార్యను పొట్టన పెట్టుకున్న వైనాన్ని వివరించిన బాలీవుడ్ సీనియర్ దర్శకుడు

  • దర్శకుడు బి.సుభాష్ కు భార్యావియోగం
  • జులై 2న మరణించిన తిలోత్తమ
  • హైబీపీ సమస్యతో బాధపడుతోందన్న సుభాష్
  • మంచినీళ్లు తక్కువగా తాగేదని వెల్లడి
  • దాంతో కిడ్నీలు పాడయ్యాయని వివరణ
బాలీవుడ్ దర్శకనిర్మాత బి.సుభాష్ కు ఇటీవల భార్యా వియోగం కలిగింది. ఆయన అర్ధాంగి తిలోత్తమ ఆగస్టు 2న కన్నుమూశారు. తన జీవన సహచరి మరణంపై బి.సుభాష్ మీడియాకు వివరాలు తెలిపారు. హైబీపీ ఎంత ప్రాణాంతకమో వివరించారు. తన భార్య తిలోత్తమ కొంతకాలంగా హైబీపీతో బాధపడుతోందని వెల్లడించారు. పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ హైబీపీ తెచ్చుకుందని అన్నారు. 

"మొదట్లో హైబీపీ ఉన్నా, ఇతరత్రా ఆరోగ్యంగానే ఉన్నట్టు కనిపించేది. కానీ, మంచి నీళ్లు చాలా తక్కువగా తాగేది. దాంతో ఆమె క్రియాటినైన్ స్థాయులు 9 పాయింట్ల వరకు పెరిగిపోయాయి. తెలుసుకునేలోపే క్రమంగా ఆమె కిడ్నీలు పాడైపోయాయి. తరచుగా డయాలసిస్ చేయించాల్సిన అవసరం ఏర్పడింది. పరిస్థితి విషమించడంతో శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిపడింది. దాంతో ఆమెను ముంబయిలోని కోకిలా బెన్ అంబానీ ఆసుపత్రిలో చేర్చాం, ఆమెకు డయాలసిస్ చేసేందుకు వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు" అని చెప్పారు. 

శరీరంలోని కీలక వ్యవస్థల పనితీరు క్షీణించడమే అందుకు కారణమని బి.సుభాష్ వెల్లడించారు. బీపీ 58/30కి పడిపోవడంతో వెంటిలేటర్ అమర్చారని, కోలుకుంటుందని భావిస్తే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు.


More Telugu News