మా పెద్దన్న చంద్రబాబు అసలు రంగు, రూపం ఇదీ!: విజయసాయిరెడ్డి
- అన్నయ్యా అంటూ వరుస కలిపి విజయసాయి వ్యంగ్యం
- చంద్రబాబు-బోయపాటి షూటింగులో 30 మంది చనిపోయారని వ్యాఖ్య
- అల్జీమర్స్ తో మర్చిపోయినా కర్మ వదలదని స్పష్టీకరణ
టీడీపీ నేతలపై సోషల్ మీడియాలో నిత్యం విమర్శనాస్త్రాలు సంధించే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి స్పందించారు. ఇటీవల చంద్రబాబు వరుసకు తనకు అన్న అవుతాడని వెల్లడించిన విజయసాయి... ఇప్పుడు ఆ వరుసతోనే ఓ ట్వీట్ చేశారు. మా పెద్దన్న చంద్రబాబు అసలు రంగు, రూపం ఇదీ అంటూ వెల్లడించారు.
అధికారంలో ఉంటే రక్తం తాగే రాక్షసుడు అని అభివర్ణించారు. ప్రతిపక్షంలో ఉంటే సానుభూతి కోసం డ్రామాలు ఆడుతుంటాడని విమర్శించారు. గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు-బోయపాటి షూటింగులో 30 మంది చనిపోతే ఆయన ఏమన్నారో మీరే వినండి అంటూ విజయసాయి ఓ వీడియోను పంచుకున్నారు. "అల్జీమర్స్ తో నువ్వు మర్చిపోయినా కర్మ వదలదు బాబన్నా" అంటూ స్పష్టం చేశారు.
విజయసాయి మరో ట్వీట్ లోనూ "అన్నయ్యా" అంటూ వరుస కలిపి విమర్శలు గుప్పించారు. "బాబన్నయ్యా... సంపాదించిన దాంట్లో కుటుంబ సభ్యులకు వాటా ఇవ్వలేదు, రాష్ట్రానికి న్యాయం చేయలేదు" అని వ్యాఖ్యానించారు. 'ముఖ్యమంత్రిగా 2016-18లో సరాసరి 7.6 శాతం, 2018-19లో 8.3 శాతం వడ్డీతో అప్పులు తెచ్చావు. వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత 2020-21లో కేవలం 6.5 శాతం వడ్డీకే రుణాలు సేకరించిందని ఆర్బీఐ నివేదిక చెబుతోంది... ఏంటన్నయ్యా ఇదంతా!" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.