షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న విమానం కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- సాంకేతిక సమస్యతో కరాచీలో ల్యాండ్ అయిన విమానం
- ప్రయాణికుల కోసం మరో విమానాన్ని పంపుతున్నామన్న ఇండిగో
- ఈ నెల 5న కరాచీలో ల్యాండ్ అయిన స్పైస్‌జెట్ ఫ్లైట్
అరబ్ దేశాల నుంచి తెలంగాణ రాజధాని హైదరాబాద్ బయలుదేరిన ఇండిగో విమానం ఉన్నట్టుండి పాకిస్థాన్ నగరం కరాచీ వైపు మళ్లింది. నిండా ప్రయాణికులతో షార్జా నుంచి వస్తున్న ఈ విమానంలో ఉన్నట్టుండి సాంకేతిక లోపం తలెత్తింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా పైలట్ ఆ విమానాన్ని కరాచీ వైపు మళ్లించాడు. ఆపై కరాచీ ఎయిర్ పోర్టులో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు.
ఈ ఘటనపై ఇండిగో ఎయిర్ లైన్స్ వివరణ ఇచ్చింది. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతోనే పైలట్ విమానాన్ని కరాచీలో సేఫ్‌గా ల్యాండ్ చేశాడని ఆ సంస్థ వెల్లడించింది. కరాచీలో దిగిన ప్రయాణికుల కోసం మరో విమానాన్ని పంపుతున్నట్లు ఇండిగో వెల్లడించింది. ఇదిలా ఉంటే... కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఇలా భారత్‌కు చెందిన విమానం కరాచీలో ల్యాండ్ కావడం ఇది రెండో సారి కావడం గమనార్హం. ఈ నెల 5న దుబాయి నుంచి వస్తున్న స్పైస్‌జెట్ విమానం కూడా సాంకేతిక సమస్య కారణంగా కరాచీలో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే.