కాళీ పోస్టర్ వివాదం.. లీనా మణిమేకలైకి కోర్టు సమన్లు

  • కాళికామాత పోస్టర్‌ను షేర్ చేసి వివాదాస్పదమైన లీనా మణిమేకలై
  • ఆగస్టు 6న కోర్టుకు హాజరు కావాలని సమన్లు
  • టూరింగ్ టాకీస్ మీడియా సంస్థపైనా కేసు
కాళికామాత పోస్టర్‌తో వివాదాస్పదమైన దర్శకురాలు లీనా మణిమేకలైకి ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 6న విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. లీనా ట్విట్టర్‌లో షేర్ చేసిన ‘కాళీ’ పోస్టర్ హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందంటూ ‘గో మహాసభ’ ప్రతినిధులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ డాక్యుమెంటరీ నిర్మాతలపైనా కేసు నమోదైంది.

మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం, నేరపూరిత కుట్ర, శాంతికి విఘాతం కలిగించే ఉద్దేశం వంటి అభియోగాలను పోలీసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో లీనాతోపాటు, ‘కాళీ’ డాక్యుమెంటరీ నిర్మాణ సంస్థ ‘టూరింగ్ టాకీస్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్’కు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా, లీనా మణిమేకలైపై ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్‌లోనూ కేసులు నమోదయ్యాయి.


More Telugu News