పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఎప్పటినుంచి అంటే...!

  • జులై 18 నుంచి వర్షాకాల సమావేశాలు
  • ఆగస్టు 12 వరకు సమావేశాలు
  • వెల్లడించిన పార్లమెంటు సెక్రటేరియట్
త్వరలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు లోక్ సభ సెక్రటేరియట్ షెడ్యూల్ వెల్లడించింది. జులై 18న ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలు ఆగస్టు 12తో ముగియనున్నాయి. పై తేదీలతో ఇటీవల పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ ప్రతిపాదనలు చేసింది. 

కాగా, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇప్పుడున్న భవనంలో జరిగే చిట్టచివరి సమావేశాలు. ఈ ఏడాది శీతాకాల సమావేశాలు కొత్త పార్లమెంటు భవనంలో జరగనున్నాయి. ఇక, పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజునే రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.


More Telugu News