ఒకప్పుడు టీవీల్లో కేసీఆర్ ను చూసి కేరింతలు కొట్టిన యువత.. ఇప్పుడు అసహ్యించుకుంటోంది: ఈటల

  • ఉద్యమ కాలంనాటి కేసీఆర్ కు, ఇప్పటి కేసీఆర్ కు తేడా ఉందన్న ఈటల 
  • టీఆర్ఎస్ నుంచి తనను వెళ్లగొట్టారని ఆగ్రహం 
  • రాష్ట్ర సమస్యలపై చర్చకు తాను సిద్ధమని వ్యాఖ్య 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమ కాలంనాటి కేసీఆర్ కు, ముఖ్యమంత్రి అయిన ఇప్పటి కేసీఆర్ కు మధ్య చాలా తేడా ఉందని అన్నారు. ఒకప్పుడు టీవీల్లో కేసీఆర్ కనపడితే యువత కేరింతలు కొట్టేవారని, ఇప్పుడు ఆయన కనపడితే అసహ్యించుకుంటున్నారని చెప్పారు. 

తాను టీఆర్ఎస్ ను వదిలిపెట్టి రాలేదని, వాళ్లే తనను వెళ్లగొట్టారని అన్నారు. తనను రెచ్చగొట్టారని, ఆత్మగౌరవం కోసం తాను రాజీనామా చేశానని చెప్పారు. రాష్ట్ర సమస్యలపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరాలని చాలా మంది ఎదురు చూస్తున్నారని చెప్పారు. సిద్ధిపేట జిల్లా కొండా భూదేవి గార్డెన్ లో నిర్వహించిన ప్రధాని మోదీ 8 ఏళ్ల సంక్షేమ పాలన సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.


More Telugu News