హైద‌రాబాద్ గ్యాంగ్ రేప్‌పై మ‌హిళా క‌మిష‌న్ ద‌ర్యాప్తు... తెలంగాణ సీఎస్, డీజీపీల‌కు నోటీసులు

  • ఆమ్నేషియా ప‌బ్ వ‌ద్ద బాలిక‌ను అప‌హ‌రించిన నిందితులు
  • కారులోనే ఆమెపై ఐదుగురు యువ‌కుల గ్యాంగ్ రేప్‌
  • ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ ప్రారంభించిన జాతీయ మ‌హిళా క‌మిష‌న్‌
  • సికింద్రాబాద్ రేప్‌పైనా విచార‌ణ మొద‌లెట్టిన‌ట్టు మ‌హిళా క‌మిష‌న్ ప్ర‌క‌ట‌న‌
హైద‌రాబాద్‌లో క‌ల‌క‌లం రేపుతున్న ఆమ్నేషియా ప‌బ్ గ్యాంగ్ రేప్‌పై జాతీయ మ‌హిళా క‌మిష‌న్ కూడా దృష్టి సారించింది. ప‌బ్ వ‌ద్ద‌కు వచ్చిన ఓ మైన‌ర్ బాలిక‌ను కారులో ఎక్కించుకున్న ఐదుగురు యువ‌కులు కారులోనే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌లు ఆందోళ‌న వ్యక్తం చేయ‌డంతో ఇప్ప‌టికే పోలీసులు ఐదుగురు నిందితుల‌ను అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో అస‌లు దోషుల‌ను పోలీసులు కాపాడుతున్నారంటూ బీజేపీ, కాంగ్రెస్ నేత‌లు ఆరోపిస్తున్నారు. 

ఇలాంటి త‌రుణంలో ఈ ఘ‌ట‌న‌పై జాతీయ మ‌హిళా క‌మిష‌న్ విచార‌ణ ప్రారంభించింది. ఈ మేర‌కు ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను అంద‌జేయాలంటూ తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, డీజీపీల‌కు మ‌హిళా క‌మిష‌న్ నోటీసులు జారీ చేసింది. మ‌రోవైపు సికింద్రాబాద్ ప‌రిధిలో చోటుచేసుకున్న అత్యాచార ఘ‌ట‌న‌పైనా విచార‌ణ మొద‌లుపెట్టిన‌ట్టు మ‌హిళా క‌మిష‌న్ ప్ర‌క‌టించింది.


More Telugu News