వీపులు మీడియా వాళ్లకే కాదు, మీకూ వుంటాయి: కర్నూలు మేయర్ పై నారా లోకేశ్ ఫైర్
- ఇష్టం వచ్చినట్టు వార్తలు రాస్తే వీపులు వాయగొడతామన్న కర్నూలు మేయర్
- మీ వీపులు విమానం మోత మోగించేందుకు ఏపీ ఓటర్లు ఎదురు చూస్తున్నారన్న లోకేశ్
- మీడియా ప్రతినిధులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్
కొన్ని వార్తాపత్రికలకు సంబంధించి కర్నూలు మేయర్ బీవై రామయ్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇష్టం వచ్చినట్టు వార్తలు రాస్తే వీపులు వాయగొడతామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నాలా లోకేశ్ మండిపడ్డారు.
వీపులు మీడియా వాళ్లకే కాదు... మీకు కూడా ఉంటాయని అన్నారు. ఎప్పుడు మీ వీపులు విమానం మోత మోగిద్దామా అని నాలుగు కోట్లకు పైగా ఉన్న ఏపీ ఓటర్లు ఎదురు చూస్తున్నారని చెప్పారు. మర్యాదగా మీడియా ప్రతినిధులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వైసీపీ సామాజిక న్యాయభేరీకి జనాలు రారని అన్నారు. అధికారులు బెదిరించి తెచ్చిన వారూ పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఈ వాస్తవాలు రాసే, చూపించే మీడియా ప్రతినిధుల వీపులు వాయగొడతారా మేయర్ గారు... ఇదేం రౌడీయిజం? అని ప్రశ్నించారు. అధికార మత్తులో నోరు పారేసుకోవద్దని హితవు పలికారు.