చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడిన విజయసాయిరెడ్డి

  • ఒంగోలులో టీడీపీ మహానాడు
  • మహానాడు కాదు మహాశ్మశానం అన్న విజయసాయి
  • చంద్రబాబు ఒక ఉన్మాది అని వ్యాఖ్యలు
  • చంద్రబాబును రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపు
ఒంగోలులో మహానాడు నిర్వహించుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వంచనకు, వెన్నుపోటుకు పుట్టిన ఉన్మాది చంద్రబాబునాయుడు అని అభివర్ణించారు. ఆ ఉన్మాదంతోనే పిల్లనిచ్చిన మామను చంపాడని ఘాటుగా విమర్శించారు. నాడు 73 ఏళ్ల ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచాడని తెలిపారు. ఇప్పుడు 72 ఏళ్ల వయసున్న ఈ ఉన్మాది చంద్రబాబుకు ఆయన కొడుకు కూడా వెన్నుపోటు పొడుస్తాడని పేర్కొన్నారు. 

నా... రా... అంటే నాసిరకం రాజకీయ నాయకుడు అని విజయసాయి అన్నారు. అందుకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై కక్షగట్టాడని వివరించారు. విపక్ష నేత ఉన్మాది చంద్రబాబును ప్రజలు రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. "కిక్ బాబు... సేవ్ ఏపీ" అన్నదే మన నినాదం అని స్పష్టం చేశారు. 

చంద్రబాబు నిర్వహిస్తున్నది మహానాడు కాదని, మహాశ్మశానం అని విజయసాయి పేర్కొన్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారణమై ఇప్పుడు శ్రాద్ధం పెట్టినట్టు మహానాడు జరుపుతున్నాడని విమర్శించారు. ఉన్నతాశయంతో రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో రామారావు గారు లేరని తెలిపారు. ఇప్పుడున్న వారంతా 'కామారావు'లే అని వ్యంగ్యం ప్రదర్శించారు.


More Telugu News