నెల వ్యవధిలోనే తెలంగాణలో ఫెర్రింగ్ రెండో యూనిట్!... రూ.500 కోట్లు పెట్టనున్న ఫార్మా కంపెనీ!
- ఇప్పటికే తెలంగాణలో ఓ యూనిట్‌ను ఏర్పాటు చేసిన ఫెర్రింగ్
- నెల క్రితమే యూనిట్‌ను ప్రారంభించిన కేటీఆర్
- తాజాగా దావోస్‌లో కేటీఆర్‌తో ఫెర్రింగ్ ప్రతినిధుల భేటీ
- హైదరాబాద్‌లో మరో యూనిట్ ఏర్పాటుకు సంసిద్ధత
తెలంగాణకు పెట్టుబడులు పోటెత్తుతున్నాయంటూ ఆ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందుకు నిదర్శనం స్విట్జర్లాండ్‌కు చెందిన ఫార్మా కంపెనీ ఫెర్రింగ్ పెట్టుబడులేనని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు దావోస్‌లో ఆ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయిన కేటీఆర్.. తెలంగాణకు మరింత మంచి వార్త అంటూ ట్వీట్ చేశారు.
నెల క్రితం హైదరాబాద్‌లో ఫెర్రింగ్ కంపెనీ తన తొలి ఫార్ములేషన్ యూనిట్‌ను ప్రారంభించింది. ఈ యూనిట్‌ను కేటీఆరే ప్రారంభించారు. తాజాగా దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరైన కేటీఆర్‌తో ఆ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ భేటీలో తమ హైదరాబాద్ యూనిట్‌ను విస్తరించనున్నట్లుగా వారు ప్రకటించారు. ఈ దిశగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న తమ రెండో యూనిట్ కోసం రూ.500 కోట్లను వెచ్చించనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇదే విషయాన్ని తెలుపుతూ కేటీఆర్ ట్వీట్ పోస్ట్ చేశారు.