ఈ సమాజం అవాస్తవాలనే ఎక్కువగా నమ్ముతుంది: సమంత
- నాగచైతన్యతో విడిపోయిన సమంత
- సోషల్ మీడియాలో ఆసక్తి రేపేలా పోస్టులు
- నిజాలు అరుదుగా బయటికి వస్తాయంటూ తాజా పోస్టు
నాగచైతన్యతో విడిపోయాక సమంత సోషల్ మీడియాలో చేసే పోస్టులు అత్యంత ఆసక్తి కలిగిస్తున్నాయి. అంతేకాదు, అభిమానుల్లో తీవ్ర చర్చకు కారణమవుతున్నాయి. తాజాగా సమంత చేసిన మరో పోస్టు కూడా ఇదే స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అవాస్తవాలే ఎప్పుడూ ప్రచారంలో ఉంటాయని, నిజాలు ఎప్పుడో అరుదుగా బయటికి వస్తాయని సమంత పేర్కొన్నారు. ఈ సమాజం కూడా అవాస్తవాలనే ఎక్కువగా నమ్ముతుందని వెల్లడించింది.
అయితే, ఈ వ్యాఖ్యలు ఆమె ఎవరిని ఉద్దేశించి చేసిందన్న విషయంలో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. వ్యక్తిగత అంశాలకు సంబంధించి సమంత ఈ వ్యాఖ్యలు చేసిందని కొందరు అంటుంటే, ఓ హాలీవుడ్ సినిమాకు సంబంధించి ఆమె వ్యాఖ్యలు చేసిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
సమంత ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉంది. గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' చిత్రం చేస్తున్న సమంత... ఓ అంతర్జాతీయ ప్రాజెక్టును కూడా చేస్తోంది. హరి-హరీశ్ దర్శకత్వంలో వస్తున్న 'యశోద' చిత్రంలోనూ సమంత ప్రధానపాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం నుంచి నిన్న గ్లింప్స్ కూడా రిలీజైంది.