ఇక నా వల్ల కాదంటూ జడేజా సంచలన నిర్ణయం... చెన్నై కెప్టెన్ గా మరోసారి ధోనీ
- ఐపీఎల్ తాజా సీజన్ లో చెన్నైకి పరాజయాలు
- 8 మ్యాచ్ ల్లో ఆరింట ఓడిపోయిన వైనం
- కొత్త కెప్టెన్ జడేజాపై తీవ్ర ఒత్తిడి
- ఇక కెప్టెన్ గా కొనసాగలేనని వెల్లడి
ఐపీఎల్ తాజా సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయాల బాటలో పయనిస్తున్న నేపథ్యంలో, తాను ఇక కెప్టెన్ గా కొనసాగలేనని రవీంద్ర జడేజా స్పష్టం చేశాడు. ఈ మేరకు జట్టు యాజమాన్యానికి తన నిర్ణయం తెలియజేశాడు. దీనిపై చెన్నై ఫ్రాంచైజీ ఓ ప్రకటన చేసింది. జడేజా సీఎస్కే కెప్టెన్సీని మళ్లీ ధోనికి అప్పగించేశాడు అని వెల్లడించింది.
"తన ఆటపై మరింత దృష్టి నిలిపేందుకు వీలుగా కెప్టెన్సీ వదులుకోవాలని జడేజా నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో, మళ్లీ పగ్గాలు స్వీకరించాల్సిందిగా ధోనీని కోరాడు. జట్టుకు సంబంధించి విస్తృత ప్రయోజనాల నేపథ్యంలో మరోసారి నాయకత్వం వహించేందుకు ధోనీ అంగీకరించాడు" అంటూ సీఎస్కే యాజమాన్యం ట్వీట్ చేసింది.
ఐపీఎల్ లో 4 పర్యాయాలు టైటిల్ గెలిచిన చెన్నై జట్టుకు ఈ సీజన్ ద్వారా కొత్త కెప్టెన్ వచ్చాడు. ధోనీ కెప్టెన్ గా తప్పుకోవడంతో రవీంద్ర జడేజాను నియమించారు. అయితే, డిఫెండింగ్ చాంప్ హోదాకు తీవ్ర అవమానం కలిగించే రీతిలో చెన్నై జట్టు ఘోర పరాజయాలు చవిచూసింది. ఈ సీజన్ లో ఇప్పటిదాకా 8 మ్యాచ్ లు ఆడిన ఆ జట్టు గెలిచింది రెండు మ్యాచ్ లే. ఈ నేపథ్యంలోనే జడేజాపై తీవ్ర ఒత్తిడి నెలకొన్నట్టు అర్థమవుతోంది.