నిరుద్యోగుల కోసం తెలంగాణ మినిస్ట‌ర్ క్వార్ట‌ర్స్‌ను ముట్ట‌డించిన జ‌న‌సేన‌

  • తెలంగాణ‌లో విడుద‌ల‌వుతున్న నోటిఫికేష‌న్లు
  • ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ
  • ఉద్యోగార్థుల వ‌యో ప‌రిమితి పెంచాల‌న్న జ‌న‌సేన‌
  • క‌రోనా నేప‌థ్యంలో మాన‌వ‌తా దృక్ప‌థంతో ఆలోచించాల‌ని డిమాండ్‌
తెలంగాణ‌లో వ‌రుస‌గా ఉద్యోగ నియామ‌కాల‌కు సంబంధించి నోటిఫికేష‌న్లు విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇటీవ‌లే పోలీసు శాఖ‌లో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి కూడా నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ నోటిఫికేష‌న్‌లో ఉద్యోగార్థుల‌కు రెండేళ్ల పాటు వ‌యో ప‌రిమితిలో సడ‌లింపు ఇవ్వాలంటూ జన‌సేన విద్యార్థి విభాగం శుక్ర‌వారం హైద‌రాబాద్‌లోని తెలంగాణ మినిస్ట‌ర్స్ క్వార్ట‌ర్స్ ముందు నిర‌స‌న‌కు దిగింది.

క‌రోనా కార‌ణంగా జీవితాలు ఛిన్నాభిన్నం అయిన నేప‌థ్యంలో మాన‌వ‌తా దృక్ప‌థంతో వ‌యో ప‌రిమితిని స‌డ‌లించాల‌ని ఈ సందర్భంగా జ‌న‌సేన విద్యార్థి విభాగం తెలంగాణ అధ్య‌క్షుడు సంప‌త్ నాయ‌క్ కోరారు. ఇది త‌మ ఒక్కరి డిమాండ్ కాద‌ని, ఉద్యోగాల కోసం సిద్ధ‌ప‌డుతున్న 5 ల‌క్షల మంది నిరుద్యోగుల డిమాండ్ అని ఆయ‌న పేర్కొన్నారు.


More Telugu News