నెల్లూరులో సమావేశంలో ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి ఆవేదన
- నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో సాగునీటి సలహా మండలి సమావేశం
- సమస్యల గురించి అధికారులను ప్రశ్నించిన ఎమ్మెల్యే ఆనం
- ధాన్యం కొనుగోళ్లలో వెనకపడ్డామని వ్యాఖ్య
- సోమశిల కాల్వలు సరిగ్గా లేవని మండిపాటు
నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో సాగునీటి సలహా మండలి సమావేశం జరగగా ఇందులో పాల్గొన్న ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి పలు సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో వెనకపడ్డామని, సమస్యలకు ఇప్పటికీ పరిష్కారం దొరకలేదని చెప్పారు.
సోమశిల కాల్వలు సరిగ్గా లేవని, మూడేళ్లుగా ఇదే పరిస్థితి ఉందని చెప్పారు. అలాగే, కాల్వల్లో చెత్త, గుర్రపు డెక్క తీస్తామని అన్నారని, ఆ పని చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహస్తున్నారని అన్నారు. నెల్లూరు వంతెన, ఇతర సమస్యల పరిష్కారాలపై ముఖ్యమంత్రి జగన్‌కు తప్పుడు సమాచారం అందిస్తున్నారని చెప్పారు.