వచ్చే మూడేళ్ల పాటు రాష్ట్రాలే బొగ్గు దిగుమతి చేసుకోవాలి: కేంద్రం

  • దేశంలో ఇంధన కొరత 
  • ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో మరింత తీవ్రం
  • 2025 వరకు ఈ పరిస్థితి తప్పదన్న కేంద్రమంత్రి  
ఇప్పటికే విద్యుత్ రంగ సమస్యలతో అల్లాడుతున్న రాష్ట్రాలపై కేంద్రం మరో భారం మోపింది. వచ్చే మూడేళ్లలో రాష్ట్రాలే బొగ్గు దిగుమతి చేసుకోవాలని స్పష్టం చేసింది. దేశీయ బొగ్గు ఉత్పత్తులు అంతంతమాత్రంగానే ఉన్నాయని కేంద్రమంత్రి ఆర్కే సింగ్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. 

దేశంలో బొగ్గుకు డిమాండ్ తీవ్రస్థాయిలో ఉందని వివరించారు. 2025 వరకు ఈ భారాన్ని రాష్ట్రాలు భరించాల్సిందేనని తెలిపారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం నేపథ్యంలో, భారత్ లో ఇంధన కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా, బొగ్గు ఉత్పాదకత, దిగుమతులు కష్టకాలం ఎదుర్కొంటున్నాయి. గత తొమ్మిదేళ్లలో వేసవి ముందు ఇంత అత్యల్ప స్థాయిలో బొగ్గు నిల్వలు ఉండడం దేశంలో ఇదే ప్రథమం.


More Telugu News