చీర కావాలో లేక చుడిదార్ కావాలో తేల్చుకోండి: చంద్రబాబు, లోకేశ్‌పై రోజా తీవ్ర వ్యాఖ్యలు
- కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయారని ఎద్దేవా
- చంద్రబాబు, లోకేశ్ చీరలు కట్టుకోవాలన్న రోజా
- మహిళ కనిపిస్తే వాటేసుకోవాలని చంద్రబాబు వియ్యంకుడు అనలేదా? అని నిలదీత
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ నేతలు సీఎం జగన్ గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయారని, చంద్రబాబు, లోకేశ్ చీరలు కట్టుకోవాలని ఆమె వ్యాఖ్యానించారు.
చీర కావాలో లేక చుడిదార్ కావాలో టీడీపీ నేతలు తేల్చుకోవాలని ఆమె అన్నారు. పరోక్షంగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై విమర్శలు గుప్పించారు. టీడీపీలో ఉన్న ఉన్మాదులు దేశంలో ఎక్కడా లేరని, మహిళ కనిపిస్తే వాటేసుకోవాలి, ముద్దుపెట్టుకోవాలని చంద్రబాబు వియ్యంకుడు అనలేదా? అని ఆమె నిలదీశారు. అచ్చెన్నాయుడు అచ్చోసిన ఆంబోతని, మహిళలను బూటుకాలితో తన్నిన చరిత్ర టీడీపీదని ఆమె విమర్శలు గుప్పించారు.
విజయవాడ ఆసుపత్రిలో అత్యాచార బాధితురాలికి పరామర్శ పేరుతో ఆ పార్టీ నేతలు ఎందుకు హడావుడి చేశారని, నిరసనలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆమె అన్నారు. మహిళ అని కూడా చూడకుండా మహిళా ఛైర్‌పర్సన్‌పై చంద్రబాబు దాడి చేయించారని ఆమె ఆరోపించారు. అప్పట్లో రిషితేశ్వరిని టీడీపీ నేతలే పొట్టనపెట్టుకున్నారని ఆమె ఆరోపించారు.
మహిళా సాధికారతకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ అని ఆమె చెప్పుకొచ్చారు. జగన్ గురించి, భారతమ్మ గురించి టీడీపీ నేతలు తమ పార్టీ మహిళా నేతలతో తప్పుడు వ్యాఖ్యలు చేయిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. జగన్‌కు దమ్ముంది కాబట్టే తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారని, చంద్రబాబు నాయుడు మాత్రం దొంగలా కరకట్టలో దాక్కున్నారని ఆమె అన్నారు.