దెబ్బకు దెబ్బ... చైనా ప్రజలకు టూరిస్టు వీసాలు రద్దు చేసిన భారత్
- చైనాలో విద్యాభ్యాసం చేస్తున్న వేలాది భారత విద్యార్థులు
- కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్వదేశానికి చేరిక
- వారిని మళ్లీ అడుగుపెట్టనివ్వని చైనా
- చైనాకు సరైన రీతిలో బదులిచ్చిన భా
భారత విద్యార్థులను అనుమతించకుండా తాత్సారం చేస్తున్న చైనాకు కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో బదులిచ్చింది. భారత్ కు వచ్చే చైనా జాతీయులు టూరిస్టు వీసాలను రద్దు చేసింది. చైనా పర్యాటకుల వీసాలను భారత్ రద్దు చేసిందన్న విషయాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్టు అసోసియేషన్ (ఐఏటీఏ) విమానయాన సంస్థలకు తెలియజేసింది. ఏప్రిల్ 20న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఏటీఏ తన సభ్య సంస్థలతో పంచుకుంది.
కరోనా వ్యాప్తి మొదలయ్యాక చైనాలో విద్యాభ్యాసం చేస్తున్న భారత విద్యార్థులు స్వదేశానికి తిరిగివచ్చారు. దాదాపు 22 వేల మంది భారత విద్యార్థులు చైనా విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు.
అయితే చైనాలో క్లాసులు ప్రారంభం కాగా, వారు తిరిగి వచ్చేందుకు చైనా ఏమాత్రం అంగీకరించడంలేదు. దాంతో వారి చదువుల పరిస్థితి అయోమయంగా మారింది. ప్రత్యక్ష బోధన విధానంలో క్లాసులు జరుగుతుండడంతో భారత విద్యార్థులు సబ్జెక్టు నేర్చుకోలేక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని భారత్ పలుమార్లు చైనా దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. దాంతో, చైనా టూరిస్టుల వీసాలను రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.