జియో ఫైబర్ ఆకర్షణీయ ప్లాన్లు.. ఇన్ స్టలేషన్ ఉచితం
- ఆరు కొత్త ప్లాన్ల ఆవిష్కరణ
- రూ.399 నుంచి రూ.3,999 మధ్య వీటి ధరలు
- ఇవన్నీ పోస్ట్ పెయిడ్ ప్లాన్లే
- రూ.200 అదనంగా చెల్లిస్తే 14 ఓటీటీ యాప్ లు
రిలయన్స్ జియో ‘జియో ఫైబర్’కు సంబంధించి ఆరు కొత్త ప్లాన్లను ప్రకటించింది. రూ.399 నుంచి రూ.3,999 మధ్య వీటి ధరలు ఉన్నాయి. ఈ ప్లాన్లలో ఏది ఎంపిక చేసుకున్నా, ఉచితంగా సెట్ టాప్ బాక్స్, ఇంటర్నెట్ బాక్స్ (గేట్ వేట్ రూటర్) అందిస్తున్నట్టు తెలిపింది. ఇన్ స్టలేషన్ కూడా ఉచితమే. ఈనెల 22 నుంచి కొత్త ప్లాన్లు అందుబాటులో ఉంటాయని రిలయన్స్ జియో ప్రకటించింది.
రూ.399, రూ.699, రూ.999, రూ.1,499, రూ.2,499, రూ.3,999. నెలవారీ పోస్ట్ పెయిడ్ ప్లాన్లు ఇవి. వీటిలో ఏ ప్లాన్ తీసుకున్నా.. ప్రతి నెలా రూ.100-200 అదనంగా చెల్లిస్తే 14 ఓటీటీ యాప్ లను యాక్సెస్ చేసుకోవచ్చని సంస్థ ప్రకటించింది. వీటిల్లో డిస్నీ హాట్ స్టార్, జీ5, సోనీ లివ్, వూట్, సన్ నెక్స్ట్, డిస్కవరీ ప్లస్, ఇరోస్ నౌ, జియో సినిమా, లయన్స్ గేట్ ఉన్నాయి.
ఇందులో రూ.399 ప్లాన్ వోచర్ లో.. అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ ను 30ఎంబీసీఎస్ వేగంతో పొందొచ్చు. ఈ ప్లాన్ తోపాటు, ప్రకటించిన అన్ని కొత్త ప్లాన్లలో ప్రతి నెలా మరో రూ.100 చెల్లించేట్టు అయితే 6 ఎంటర్ టైన్ మెంట్ యాప్స్ ను ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. రూ.200 చెల్లిస్తే 14 ఓటీటీ యాప్స్ ను వీక్షించొచ్చు.