ఎన్టీఆర్ జిల్లాలో విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్.. ఇన్‌స్టాలో పోస్టులే కారణమట
- మిక్ కాలేజీలో విద్యార్థుల మధ్య ఘర్షణ
- హాకీ స్టిక్‌లు, రాడ్లతో దాడి చేసుకున్న వైనం
- పలువురు విద్యార్థులకు గాయాలు, ఆసుపత్రికి తరలింపు
ఏపీలోని కొత్తగా ఏర్పాటైన ఎన్టీఆర్ జిల్లాలో సోమవారం గ్యాంగ్ వార్ చోటుచేసుకుంది. విజయవాడ సమీపంలోని కంచికచర్లకు చెందిన మిక్ కళాశాలకు చెందిన విద్యార్థుల మధ్య చెలరేగిన ఓ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది. ఇరువర్గాలుగా విడిపోయిన విద్యార్థులు హాకీ స్టిక్‌లు, ఐరన్ రాడ్లు చేతబట్టి ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో పలువురు విద్యార్థులకు గాయాలు కాగా.. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కళాశాలకు చెందిన విద్యార్థుల గ్రూపుల్లో ఇన్‌స్టాగ్రాంలో ప్రత్యక్షమైన పోస్టులతో వివాదం రేకెత్తింది. ఈ వివాదం వాగ్వాదాలకు మాత్రమే పరిమితం కాకుండా ఏకంగా గ్యాంగ్ వార్‌కు దారి తీసింది. ఇరు వర్గాలుగా విడిపోయిన విద్యార్థులు చేతికి అందిన హాకీ స్టిక్‌లు, రాడ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వివరాలపై ఆరా తీస్తున్నారు.