బ్రహ్మోస్ క్షిపణి మిస్ ఫైర్ ఘటనలో బ్రహ్మోస్ యూనిట్ చీఫ్, సిబ్బందిపై చర్యలు

  • కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ పూర్తి
  • వాళ్లే బాధ్యులని తేలిన వైనం
  • మానవ తప్పిదం వల్లే ఘటన అని వెల్లడి
బ్రహ్మోస్ క్షిపణి మిస్ ఫైర్ అయిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తోంది. క్షిపణి మిస్ ఫైర్ అయిన బ్రహ్మోస్ యూనిట్ కు నేతృత్వం వహిస్తున్న కమాండింగ్ ఆఫీసర్, ఇతర సిబ్బందిపై చర్యలు తీసుకోనుంది. గత నెల 9న మన దేశం నుంచి మిస్ ఫైర్ అయిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి పాకిస్థాన్ లోపల 124 కిలోమీటర్ల దూరంలో పడిన సంగతి తెలిసిందే. 

దీనిపై పాకిస్థాన్ నుంచి విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని అధికారులు గతంలో ప్రకటించారు. ఈ క్రమంలోనే సంబంధిత అధికారులు, సిబ్బందిపై కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ నిర్వహించారు. కమాండింగ్ ఆఫీసర్ తో పాటు గ్రూప్ కెప్టెన్ ర్యాంక్ అధికారి, ఇతర సిబ్బందిని బాధ్యులుగా గుర్తించారు. మానవ తప్పిదంతోనే ఐఏఎఫ్ బేస్ నుంచి మిసైల్ ఫైర్ అయిందని తేల్చారు. దీంతో వారిపై కోర్ట్ ఆఫ్ ఇంక్వైరీ నిర్దేశించిన ప్రకారం అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 



More Telugu News