ముంబయి బాంబు పేలుళ్ల సూత్ర‌ధారికి 31 ఏళ్ల జైలు శిక్ష విధించిన పాక్ కోర్టు

  • ముంబయి పేలుళ్ల మాస్ట‌ర్ మైండ్ స‌యీదే
  • పాక్ భూభాగం మీద ఉంటూనే దాడుల నియంత్ర‌ణ‌
  • ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డ్డాడ‌న్న ఆరోప‌ణ‌పై విచార‌ణ‌
  • శిక్ష ఖ‌రారు చేసిన పాక్ యాంటి టెర్రరిజం కోర్టు
ముంబయి బాంబు పేలుళ్ల ప్ర‌ధాన సూత్ర‌ధారి,. ల‌ష్క‌రే తోయిబా చీఫ్ హ‌ఫీజ్ స‌యీద్‌కు 31 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పాకిస్థాన్ కోర్టు కీల‌క తీర్పు చెప్పింది. ఈ మేర‌కు పాకిస్థాన్‌లోని యాంటీ టెర్రరిజం కోర్టు శుక్ర‌వారం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. 

ముంబయి బాంబు పేలుళ్ల‌కు ప‌థ‌కం ర‌చించడంతో పాటుగా క‌స‌బ్ స‌హా ప‌లువురు ఉగ్ర‌వాదులు ముంబయి చేరుకునేందుకు ప‌క్కా ప్లాన్ గీసి ఇచ్చిన స‌యీద్.. పాక్ భూభాగంపై ఉంటూనే ముంబయి బాంబు పేలుళ్ల‌ను నియంత్రించాడు. ఈ క్ర‌మంలో భార‌త్ అత‌డిని అప్ప‌గించాలంటూ ప‌లుమార్లు పాక్ కు లేఖ‌లు రాసినా.. ఆ వైపు నుంచి స్పంద‌న రాలేదు. తాజాగా ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నాడ‌న్న ఆరోప‌ణ‌ల‌పై పాక్ యాంటీ టెర్రరిజం కోర్టు విచార‌ణ చేప‌ట్టి అత‌డికి 31 ఏళ్ల జైలు శిక్ష‌ను ఖ‌రారు చేసింది.


More Telugu News