రెస్టారెంట్ వెలుపల రామ్ చరణ్ ను డబ్బులు అడిగిన బిచ్చగత్తె... వీడియో ఇదిగో!

  • ముంబయిలో పర్యటించిన రామ్ చరణ్
  • ఓ థియేటర్ లో ఆర్ఆర్ఆర్ వీక్షణ
  • బాంద్రాలోని ఓ రెస్టారెంట్ లో విందు
  • బిచ్చగత్తెకు డబ్బులు ఇచ్చిన రామ్ చరణ్
ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ విజయంతో ఆనందోత్సాహాల్లో ఉన్న టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ నిన్న ముంబయిలో పర్యటించారు. అక్కడ ఓ థియేటర్లో ఆర్ఆర్ఆర్ ను వీక్షించారు. అక్కడి అభిమానులను అలరించారు. కాగా, బాంద్రాలోని మిజూ రెస్టారెంట్ లో విందు అనంతరం ఆయన బయటికొచ్చి కారెక్కబోతుండగా, ఓ బిచ్చగత్తె డబ్బులు అడిగింది. వెంటనే స్పందించిన రామ్ చరణ్... కారు వద్దకు రావాలని చెబుతూ ఆమెకు చిరునవ్వుతో డబ్బులు అందించారు. అనంతరం అక్కడినుంచి నిష్క్రమించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.


More Telugu News