నూకలు తినమని పియూష్ గోయల్ అన్నట్టుగా డ్రగ్స్ మత్తులో కేటీఆర్ కలగన్నారు: ఎంపీ అర్వింద్
- ధాన్యం కొనుగోలు, డ్రగ్స్ అంశాలపై అర్వింద్ స్పందన
- కేసీఆర్ ప్రతి గింజా కొంటామని చెప్పారని వెల్లడి
- ధాన్యం కొనకుండా ధర్నాలు హాస్యాస్పదమని వ్యాఖ్యలు
- డ్రగ్స్ దందాకు కేటీఆరే కెప్టెన్ అని విమర్శలు
వరిధాన్యం కొనుగోలు చేయకుండా టీఆర్ఎస్ నేతలు ఉద్యమం చేస్తాననడం హాస్యాస్పదం అని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు. ప్రతి గింజా కొంటామని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారని, రైతులకు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టలేక ధాన్యం కొనుగోలుపై రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. రైతులకు బోనస్ ఇవ్వలేక కేంద్రంపై నెపం మోపుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేటీఆర్ కనుసన్నల్లోనే రీసైకిల్ బియ్యం దందా నడుస్తోందని అర్వింద్ ఆరోపించారు. తెలంగాణ ప్రజలను నూకలు తినాలని కేంద్రమంత్రి పియూష్ గోయల్ అన్నట్టు డ్రగ్స్ మత్తులో కేటీఆర్ కలగన్నారు అని ఎద్దేవా చేశారు. ముంబై నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని, రాష్ట్రంలోని డ్రగ్స్ దందాకు కేటీఆరే కెప్టెన్ అని అన్నారు.
కేటీఆర్ పై పరువునష్టం దావా వేయాలని కేంద్రమంత్రి పియూష్ గోయల్ ను కోరుతున్నా అని అర్వింద్ తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ పదవుల్లో ఉన్నంతకాలం హైదరాబాద్ 'ఉడ్తా హైదరాబాద్' గా ఉంటుందని వ్యాఖ్యానించారు. గతంలో పంజాబ్ లో డ్రగ్స్ తీవ్రతపై 'ఉడ్తా పంజాబ్' అనే చిత్రం రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే, అర్వింద్ ఉడ్తా హైదరాబాద్ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.