ఏప్రిల్ 4 అపాయింటెడ్ డే.. ఏపీలో కొత్త జిల్లాలపై తుది నోటిఫికేషన్
- 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లతో గెజిట్
- మండలాలు, నియోజకవర్గాల వారీగా వేర్వేరు నోటిఫికేషన్లు
- అన్ని జిల్లాలకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నియామకం
కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం ఈరోజు తుది నోటిఫికేషన్ ను జారీ చేసింది. రేపటి నుంచే కొత్త జిల్లాలు పరిపాలనపరంగా కొత్త యూనిట్ గా మారుతాయని పేర్కొంది. భౌగోళికంగా మార్పులు చేసిన అన్ని జిల్లాలకు ఏప్రిల్ 4 అపాయింటెడ్ డేగా ఉంటుందని స్పష్టం చేసింది.
ఈ మేరకు 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేస్తున్నట్టు గెజిట్ నోటిఫికేషన్లను జారీ చేసింది. ప్రతి జిల్లాకు చెందిన నియోజకవర్గాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లా కేంద్రాన్ని పేర్కొంటూ వేర్వేరు నోటిఫికేషన్లను ఇచ్చింది. కాగా, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం నియమించింది.