హైదరాబాదులో డ్రగ్స్ మరణం తెలంగాణ సమాజాన్ని నిర్ఘాంతపోయేలా చేసింది: రేవంత్ రెడ్డి
- హైదరాబాదులో డ్రగ్స్ కు బానిసైన యువకుడి మృతి
- సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన రేవంత్ రెడ్డి
- గోవా-హైదరాబాద్ మధ్య డ్రగ్స్ కారిడార్ అంటూ సందేహాలు
హైదరాబాదులో ఓ బీటెక్ విద్యార్థి డ్రగ్స్ కు బానిసై ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. మాదక ద్రవ్యాలకు బానిసై 23 ఏళ్ల ఇంజినీరింగ్ కుర్రాడు మృత్యువాతపడడం తెలంగాణ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. నగరంలో డ్రగ్స్ రక్కసి కారణంగా తొలి మరణం సంభవించడం ఆందోళనకరమని తెలిపారు. డ్రగ్స్ దందాపై జాతీయస్థాయిలో సిట్ వేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
తాజా ఘటన చూస్తుంటే, గోవా-హైదరాబాద్ మధ్య డ్రగ్స్ కారిడార్ ఏర్పాటైందేమోనన్న కొత్త సందేహాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. డ్రగ్స్ భూతం ప్రతిసారి ఏదో ఒక రూపంలో పడగ విప్పుతోందని, దాంతో సంబంధం ఉన్న రాజకీయ నేతలను, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులను కాపాడేందుకు రాష్ట్ర సర్కారు ప్రయత్నిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.