పాము పొడవు లేడు ఆ బుడతడు.. దాని తోక పట్టుకుని ఓ ఆట ఆడించేశాడు.. వామ్మో అనిపించే వీడియో ఇదిగో

  • ప్రమాదకర రక్తపింజరతో విన్యాసాలు
  • పాము వెళ్లిపోతున్నా దానినే వెంబడించిన చిన్నారి
  • వైరల్ గా మారిన వీడియో
పామును చూస్తేనే కెవ్వుమంటూ గావుకేక పెట్టి అల్లంత దూరం పారిపోతాం. అలాంటిది పాము అంత కూడా లేని ఓ బుడతడు.. ఆ పాము తోక పట్టుకుని ఆడించాడంటే.. అది కూడా అత్యంత ప్రమాదకరమైన రక్త పింజరను పరుగులు పెట్టించాడంటే.. వామ్మో, అని వణుకుపుడుతుంది కదూ? 

ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఇప్పుడు ఆ వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. తెగ చక్కర్లు కొడుతోంది. 5 అడుగుల పొడవున్న రక్త పింజర పామును.. దాని పొడవు కూడా లేని ఓ చిన్నారి తోక పట్టుకుని ఓ ఆట ఆడించేశాడు. అది ఆ చిన్నారి చేతి నుంచి విడిపించుకుని పోదామని ప్రయత్నించినా ఆ చిన్నోడు వదిలితేనా! 

ఇంతలో ఇంకో బుడతడొచ్చి దాన్ని పట్టుకునేందుకు పోటీ పడ్డాడు. దీంతో మొదటి చిన్నారి చేతి నుంచి పాము జారింది. అతడి చేతుల్లో నుంచి తుర్రుమని జారుకుంది. అయినా, కూడా ఆ పామును పట్టుకునేందుకు ఆ బుడతడు ఇసుమంతైనా బెదురు, బెరుకూ లేకుండా వెంబడించేశాడు.  

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


More Telugu News