ట్రాఫిక్ చలాన్ల రాయితీ ఈ నెలాఖరు వరకే.. పొడిగింపు ఉండదు: ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్

  • ఇప్పటి వరకు 1.85 కోట్ల చలాన్లు క్లియర్ అయ్యాయి
  • ఇంతవరకు రూ. 190 కోట్లు వసూలయ్యాయి
  •  ఏప్రిల్ నుంచి నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఛార్జిషీట్లు వేస్తామన్న రంగనాథ్  
ట్రాఫిక్ చలాన్ల రాయితీకి వాహనదారుల నుంచి భారీ స్పందన వస్తోందని ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. ఇప్పటి వరకు 1.85 కోట్ల చలాన్లు క్లియర్ అయ్యాయని... ఈ చలాన్ల ద్వారా రాయితీ పోగా రూ. 190 కోట్లు వసూలయ్యాయని చెప్పారు. రోజుకు 7 నుంచి 10 లక్షల చలాన్లు క్లియర్ అవుతున్నాయని తెలిపారు. 

ఇక ఈ నెల 31 వరకే చలాన్లపై రాయితీ సదుపాయం ఉంటుందని... ఈ రాయితీ గడువును పొడిగించే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. ఏప్రిల్ నెల నుంచి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే ఛార్జిషీట్లు వేస్తామని చెప్పారు. టార్గెట్లు పెట్టుకుని చలాన్లు వసూలు చేయాలనే ఆలోచన తమకు లేదని తెలిపారు. ఓవరాల్ గా 60 నుంచి 70 శాతం చలాన్లు క్లియర్ అవుతాయని తాము భావిస్తున్నామని చెప్పారు.


More Telugu News