గతంలో టీడీపీకి ఓటు వేసిన వారు ఇప్పుడు మా వెంట ఉన్నారు: జగన్
- జరుగుతున్న మంచిని ప్రజలు గమనిస్తున్నారు
- ఉనికి కోసం టీడీపీ డ్రామాలు ఆడుతోంది
- చంద్రబాబు ఒక్క మంచి పని కూడా చేయలేదన్న సీఎం
మూడేళ్లలో 95 శాతం హామీలను నెరవేర్చామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 2.56 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం కోసం బడ్జెట్ లో నిధులను కేటాయించామని తెలిపారు. ప్రజా సంక్షేమానికి తాము అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నామని... కరోనా వల్ల ఆదాయం తగ్గినా తమ దీక్ష మాత్రం మారలేదని చెప్పారు.
జరుగుతున్న మంచిని ప్రజలు గమనిస్తున్నారని జగన్ అన్నారు. గతంలో టీడీపీకి ఓటు వేసిన వారు ఇప్పుడు తమ వెంట ఉన్నారని చెప్పారు. అందుకే టీడీపీ ఉనికి కోసం డ్రామాలు ఆడుతోందని ఎద్దేవా చేశారు. ప్రతి ఎన్నికలో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారని చెప్పారు. చెప్పుకోవడానికి చంద్రబాబు ఒక్క మంచి పని కూడా చేయలేదని... తమ ప్రభుత్వం మాత్రం అందరూ నా వాళ్లే అని భావిస్తోందని అన్నారు.