అమరావతి ఉద్యమంపై సినిమా.. రాయపూడిలో సన్నివేశాల చిత్రీకరణ

  • మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా వచ్చిన అమరావతి ఉద్యమం
  • నటీనటులుగా వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ తదితరులు
  • క్లాప్ కొట్టి ముహూర్తపు షాట్‌ను ప్రారంభించిన జేఏసీ నాయకులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా చేపట్టిన అమరావతి ఉద్యమంపై సినిమా రూపుదిద్దుకుంటోంది. కె.రవిశంకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు నరేంద్ర దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. వినోద్ కుమార్, వాణీవిశ్వనాథ్, నిఖిల్, రాణి తదితరులు నటిస్తున్నారు. రాజధాని ఉద్యమం, దాని ఆవశ్యకతను నేపథ్యంగా తీసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 

అమరావతి జేఏసీ సహకారంతో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి అమరావతిలోని రాయపూడిలో నిన్న కొన్ని సీన్లు చిత్రీకరించారు. జేఏసీ నాయకులు బెల్లంకొండ నరసింహారావు, పువ్వాడ సుధాకర్, చలపతిరావు, చంటి తదితరులు క్లాప్ కొట్టి ముహూర్తపు షాట్‌ను ప్రారంభించారు. రాయపూడిలోని ఓ ఇంటి పరిసరాల్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. రాజధాని గ్రామాల రైతులు, కూలీలు, మహిళలు హాజరై చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.


More Telugu News