'జూనియర్'కి హీరోయిన్ దొరికేసింది!
- శ్రీలీల చేతిలో అరడజను సినిమాలు
- నితిన్ జోడీగాను దక్కిన ఛాన్స్
- దీనికి వక్కంతం వంశీ దర్శకత్వం
- 'జూనియర్' టైటిల్ ఇప్పటికే ఖరారు
నితిన్ హీరోగా 'మాచర్ల నియోజక వర్గం' సినిమా రూపొందుతోంది. నితిన్ సొంత బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమాకి రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలోని రాజకీయాల చుట్టూ నడిచే కథ ఇది. ఈ సినిమాలో కథానాయికగా కృతి శెట్టి కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగు ముగింపు దశకి చేరుకుంది.
ఇక దీని తర్వాత నితిన్ నటించే తదుపరి చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాకి 'జూనియర్' అనే టైటిల్ ను ఆయన ఖాయం చేశాడు. ఈ సినిమాలో నితిన్ జోడీగా ఆయన శ్రీలీలను ఎంపిక చేసినట్టుగా సమాచారం. ఇప్పటికే శ్రీలీల ఓ అరడజను ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు.
వక్కంతం వంశీ మంచి రైటర్ .. ఎన్నో సినిమాలకు పనిచేసిన అనుభవం ఉంది. అయితే దర్శకుడిగా తొలి ప్రయత్నంలో సక్సెస్ ను చూడలేకపోయిన ఆయన, రెండవ ప్రాజెక్టుగా ఈ సినిమా చేస్తున్నాడు. 'భీష్మ' తరువాత వరుస ఫ్లాపులతో ఉన్న నితిన్ ను ఈ సినిమా అయినా గట్టెక్కిస్తుందేమో చూడాలి.