సజ్జనార్ క్రియేటివిటీకి నెటిజన్ల ఫిదా.. ‘ఆర్ఆర్ఆర్’కి కొత్త భాష్యం.. వీడియో వైరల్!
- వినూత్న పథకాలతో ప్రయాణికులను ఆకర్షిస్తున్న సజ్జనార్
- ఆర్ఆర్ఆర్ అంటే ‘రాష్ట్ర రోడ్డు రవాణా’గా కొత్త అర్థం
- ‘నెత్తురు మరిగితే ఎత్తర జెండా’ పాటను ప్రచారానికి వాడుకున్న సజ్జనార్
సజ్జనార్ తెలంగాణ ఆర్టీసీ ఎండీ అయ్యాక ‘బస్సు’ పరుగులు తీస్తోంది. వినూత్న పథకాలు ప్రవేశపెడుతూ ప్రయాణికులను ఆకర్షిస్తున్నారు. అలాగే, వెరైటీ పబ్లిసిటీతో ఆర్టీసీని నిత్యం వార్తల్లో నిలుపుతున్నారు. తాజాగా, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ఆర్టీసీ ప్రచారానికి వాడేసుకున్నారు. అంతేకాదు, ఆర్ఆర్ఆర్ అర్థాన్ని కూడా పూర్తిగా మార్చేసి కొత్త భాష్యం చెప్పారు.
‘ఆర్ఆర్ఆర్’ను ‘రాష్ట్ర రోడ్డు రవాణా’గా మార్చేశారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాలోని ‘నెత్తురు మరిగితే ఎత్తర జెండా’ సాంగ్‌ని కూడా ఆర్టీసీ ప్రచారానికి వాడుకున్నారు. ఆ పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్ పట్టుకున్న జెండాపై ‘వందేమాతరం’ అని ఉండగా సజ్జనార్ మాత్రం వాటి స్థానంలో టీఎస్ఆర్‌టీసీ అని రాయడంతోపాటు దాని కింద బస్సు, లోగోను పెట్టారు. ఇది చూసిన నెటిజన్లు ఆయన క్రియేటివిటీకి ఫిదా అవుతున్నారు.