రిలీజ్ డేట్ చెప్పిన విష్వక్సేన్!

  • విష్వక్ సేన్ కి మాస్ లో మంచి క్రేజ్ 
  • తాజా చిత్రం 'అశోకవనంలో అర్జున కల్యాణం'
  • వినోదమే ప్రధానంగా సాగే కథ
  • ఏప్రిల్ 22వ తేదీన విడుదల
విష్వక్సేన్ హీరోగా 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమా రూపొందింది. ఈ సినిమాను ఇంతకుముందే విడుదల చేయాలనుకున్నారు. అయితే బరిలోకి పెద్ద సినిమాలు దిగడంతో వాయిదా వేసుకున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. ఏప్రిల్ 22వ తేదీన ఈ  సినిమాను విడుదల చేయనున్నట్టు చెబుతూ, ఒక పోస్టర్ ను వదిలారు. 

బాపినీడు - సుధీర్ నిర్మించిన ఈ సినిమాకి విద్యాసాగర్ దర్శకత్వం వహించాడు. జై క్రిష్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో ప్రధానమైన కథానాయికగా రుక్షర్ థిల్లోన్ నటించగా, మరో కథానాయికగా రితిక నాయక్ కనిపించనుంది. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ కారణంగా అందరిలో ఆసక్తి పెరిగింది. 

ఈ కథ ఇటు టౌన్ లోను .. అటు విలేజ్ లోను నడుస్తుంది. హీరో పెళ్లిచూపుల కోసం అమ్మాయి వాళ్ల ఊరు రావడంతో అసలు కథ మొదలవుతుంది. ఈ సినిమాలో ఆర్టిస్టులు చాలామందే కనిపిస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు తెచ్చుకోవాలనే విష్వక్ సేన్ ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి.


More Telugu News