తమిళ సాంగ్ కు నడి రోడ్డుపై డ్యాన్స్ చేసిన పీవీ సింధు.. వీడియో ఇదిగో!

  • ఇటీవలి కాలంలో డ్యాన్స్ చేస్తూ అలరిస్తున్న సింధు
  • వైరల్ అవుతున్న తాజా డ్యాన్స్ వీడియో
  • గతంలో చేసిన డ్యాన్స్ వీడియోకు 9 లక్షల లైకులు
చేతిలో షటిల్ రాకెట్ పట్టుకుని కోర్టులో పీవీ సింధు చేసే విన్యాసాలు మైమరపిస్తాయి. ప్రత్యర్థులను చిత్తు చేయడానికి కోర్టులో ఆమె పోరాడే తీరు అద్భుతంగా ఉంటుంది. మన దేశం గర్వించేలా ఎన్నో ఘన విజయాలను ఆమె సాధించింది. ఇటీవలి కాలంలో ఆమె డ్యాన్స్ కూడా చేస్తూ అభిమానులకు వినోదాన్ని పంచుతోంది. తాజాగా ఓ తమిళ పాటకు నడి రోడ్డు మీద డ్యాన్స్ ఇరగదీసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

కొన్ని రోజుల క్రితం కూడా ఎల్లో కలర్ డ్రెస్ లో ఆమె స్టెప్పులు వేసింది. ఆ డ్యాన్స్ వీడియోను దాదాపు 9 లక్షల మంది లైక్ చేశారు. నిన్న చేసిన తాజా డ్యాన్స్ కు అప్పుడే రెండు లక్షలకు పైగా లైకులు వచ్చాయి. 



More Telugu News