మ‌ర‌ణాల‌పై ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న చేయాలి: చంద్ర‌బాబు

  • జంగారెడ్డిగూడెంలో నాటుసారా మ‌ర‌ణాలపై చంద్ర‌బాబు ఫైర్
  • ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా? అని ప్ర‌శ్న‌
  • ప్ర‌భుత్వం స్పందించ‌డం లేద‌ని విమ‌ర్శ‌
  • ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న భయాందోళనలను పోగొట్టాలని డిమాండ్
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నాటు సారా కార‌ణంగా వరుసగా మరణాలు సంభ‌విస్తోన్న విష‌యం తెలిసిందే. ఆ ప్రాంతంలో మృతుల సంఖ్య 18కి పెరిగింది. దీనిపై స్పందించిన టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు ఏపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా? అని ఆయ‌న నిల‌దీశారు. 

ప్ర‌జ‌ల ప్రాణాలు పోతున్నప్ప‌టికీ ప్ర‌భుత్వం స్పందించ‌పోవ‌డం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. జంగారెడ్డిగూడెంలో పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నప్ప‌టికీ ప్ర‌భుత్వం చర్యలు తీసుకోవ‌ట్లేద‌ని చెప్పారు. అక్క‌డ చోటు చేసుకున్న‌ మరణాలపై ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని ఆయ‌న అన్నారు. 

వ‌రుస మ‌ర‌ణాల‌తో స్థానికంగా ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న భయాందోళనలను పోగొట్టాలని ఆయ‌న అన్నారు. నాటుసారా తాగి మ‌ర‌ణించిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ఆయ‌న కోరారు. కాగా, జంగారెడ్డిగూడెంలో నాలుగు రోజుల వ్యవధిలో 18 మంది ప్రాణాలు కోల్పోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. వారంతా నాటు సారా కార‌ణంగానే చ‌నిపోయిన‌ట్లు ప్ర‌జ‌లు భావిస్తున్నారు. ఇటీవ‌ల పోలీసులు నాటు సారా త‌యారీ కేంద్రాల‌పై దాడులు నిర్వ‌హించారు.


More Telugu News