అందాల పాయల్ కి మంచి ఛాన్స్ దక్కిందే!

  • 'ఆర్ ఎక్స్ 100'తో ఎంట్రీ 
  • యూత్ లో పాయల్ కి మంచి క్రేజ్ 
  • సక్సెస్ కోసం వెయిటింగ్
  • మంచు విష్ణు జోడీగా ఛాన్స్  
తెలుగు తెరపై పొడగరి భామల జాబితాలో పాయల్ ముందు వరుసలో కనిపిస్తుంది. 'ఆర్ ఎక్స్ 100' సినిమాలో అందాలు ఆరబోస్తూ ఈ సుందరి కుర్రాళ్లకు కునుకు లేకుండగా చేసింది. ఆ తరువాత 'వెంకీమామ' .. 'డిస్కోరాజా' వంటి పెద్ద సినిమాలు చేసినా, అవి ఆమె కెరియర్ కి పెద్దగా హెల్ప్ కాలేదు. ఈ నేపథ్యంలో వచ్చిన అవకాశాలతోనే కెరియర్ ను నెట్టుకొస్తోంది.

ప్రస్తుతం ఆది సాయికుమార్ సరసన చేసిన 'కిరాతక' విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆమెకి మంచు విష్ణు సరసన నాయికగా అవకాశం లభించింది. 'గాలి నాగేశ్వరరావు' టైటిల్ తో మంచు విష్ణు ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన సొంత బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా కోసం పాయల్ ను తీసుకున్నారు. 

ఈ విషయాన్ని పాయల్ ధ్రువీకరించింది. "మంచు విష్ణుతో నా కొత్త సినిమా మొదలైంది .. చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను. ఈ సినిమాలో నేను 'స్వాతి' అనే పాత్రలో కనిపిస్తాను" అని చెప్పుకొచ్చింది. 'మోసగాళ్లు' తరువాత మంచు విష్ణు తన సొంత బ్యానర్లో చేస్తున్న ఈ సినిమా ఆమె కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.


More Telugu News