దేశానికి సరికొత్త దశ, దిశ కోసం యత్నం: కేసీఆర్
- ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో భేటీ
- అక్కడే మీడియాతో మాట్లాడిన కేసీఆర్
- దేశంలో ఆశించిన అభివృద్ధి జరగలేదని వ్యాఖ్య
- త్వరలోనే ప్రత్యామ్నాయంపై నిర్ణయముంటుందని ప్రకటన
జాతీయ స్థాయిలో తృతీయ కూటమి కోసం యత్నాలు చేస్తున్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ దిశగా శుక్రవారం సరికొత్త వ్యాఖ్యలు చేశారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకున్న కేసీఆర్ తిరుగు ప్రయాణంలో భాగంగా ఝార్ఖండ్ వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్‌తో భేటీ అయ్యారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాట్లు, ఆ దిశగా సాగాల్సిన ఆవశ్యకతపై ఆయన సోరేన్‌తో చర్చించారు. ఈ సందర్భంగా దేశ అభివృద్దిపై కేసీఆర్ తనదైన వ్యాఖ్యలు చేశారు.
దేశానికి సరికొత్త దశ, దిశ కోసం ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నామని కేసీఆర్ చెప్పారు. దేశాన్ని సరైన దిశలో తీసుకెళ్లేందుకు చర్చలు ప్రారంభమయ్యాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా దేశంలో ఆశించిన మేర అభివృద్ధి జరగలేదని కేసీఆర్ అన్నారు. దేశంలో ఇప్పటికంటే మెరుగైన అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పారు. దేశాన్ని సరైన దిశలో నడిపేందుకు ఏ మార్గాన్ని అనుసరిస్తే బాగుంటుందన్న దానిపై ఆలోచన చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా దేశంలో ప్రత్యామ్నాయంపై త్వరలోనే నిర్ణయం ఉంటుందని కూడా కేసీఆర్ చెప్పుకొచ్చారు.