మంత్రి మేకపాటి మృతిపై వరల్డ్ ఎకనామిక్ ఫోరం దిగ్భ్రాంతి
- వారం రోజుల క్రితమే ఆయన సమక్షంలో ఒప్పందం చేసుకున్నామన్న రీజెన్సీ గ్రూప్
- మేకపాటి ఆత్మకు శాంతి కలిగేలా ఏపీలో పెట్టుబడులు పెడతామని ప్రకటన
- గౌతమ్ రెడ్డి నిబద్ధత ఆకట్టుకుందన్న షరాఫ్ గ్రూప్
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల వరల్డ్ ఎకనామిక్ ఫోరం సహా పలు పారిశ్రామిక సంస్థలు సంతాప ప్రకటనలు విడుదల చేశాయి. గౌతమ్ రెడ్డి మృతి చెందారన్న వార్త తెలిసిన ఆయా సంస్థలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ మధ్యనే ఢిల్లీలో మేకపాటితో కలిసి చర్చలు జరిపామని, ఇంతలోనే ఇటువంటి వార్త తమను దిగ్భ్రాంతికి గురి చేసిందంటూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం తన సంతాప సందేశంలో పేర్కొంది.
వారం రోజుల క్రితమే రాష్ట్రంలో పెట్టుబడుల గురించి ఆయన సమక్షంలో ఒప్పందం చేసుకున్నామని, ఆయన మరణించినా రాష్ట్రంలో పెట్టుబడుల సంబంధాన్ని కొనసాగించడం ద్వారా ఆయన ఆత్మకు శాంతిని చేకూరుస్తామని రీజెన్సీ గ్రూపు చైర్మన్ ఎస్‌బీ హాము హజీ పేర్కొన్నారు.
దుబాయ్ పర్యటనలో మంత్రిగా మేకపాటి నిబద్ధత, నిరాడంబరత తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని, వారం రోజుల్లోనే ఈ విషాద వార్త హృదయాలను కలచివేసిందని షరాఫ్ గ్రూపు వైస్ చైర్మన్ షరాబుద్ధీన్ షరాఫ్ పేర్కొన్నారు. జీ42 గ్రూపు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా దుబాయ్ చాప్టర్ మేకపాటి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేశాయి.