హీరోయిన్ లేని సినిమాలో ప్రభుదేవా

  • కొత్త దర్శకుడికి అవకాశం
  • శామ్ రోడ్రిగ్స్ తో సినిమా
  • 'ముసాషి'గా టైటిల్ ఖరారు
డ్యాన్స్ మాస్టర్ గానే కాదు.. హీరోగా, డైరెక్టర్ గానూ ప్రభుదేవా మల్టీ రోల్స్ పోషిస్తున్నాడు. తాజాగా శామ్ రోడ్రిగ్స్ అనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. దానికి ‘ముసాషి’ అనే టైటిట్ ను ఖరారు చేశారు. ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ చేతుల మీదుగా విడుదల చేశారు.

అయితే, ఈ సినిమాకో విశేషం ఉందట. అదేమిటంటే, ఇందులో హీరోయిన్ వుండదట. ప్రభుదేవాను పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా చూపించనున్న ఈ సినిమాను జాయ్ ఫిలిం బాక్స్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై జాన్ బ్రిట్టో నిర్మిస్తున్నారు. జాన్ విజయ్, వీటీవీ గణేశ్, మహేంద్రన్, ప్రసాద్ ఎస్ఎన్, బినూపప్పు, అరుళ్ దాస్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. విజ్ఞేశ్ చాయాగ్రహణం అందించనున్నారు.


More Telugu News