దేశవ్యాప్తంగా నేడు, రేపు ‘సంతాప దినాలు’

  • ప్రభుత్వ వర్గాలు వెల్లడి
  • 6, 7 తేదీల్లో జాతీయ జెండా అవనతం
  • లతా మంగేష్కర్ కు గౌరవ నివాళి
  • నేటి సాయంత్రం ముంబైలో గానకోకిల అంత్యక్రియలు
లెజండరీ గాయని లతా మంగేష్కర్ మృతికి నివాళిగా రెండు రోజుల పాటు సంతాప దినాలుగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం ఉదయం లతా మంగేష్కర్ తుది శ్వాస విడవడం తెలిసిందే.

‘‘లతా మంగేష్కర్  జ్ఞాపకార్థం  ఫిబ్రవరి 6, 7వ తేదీలను జాతీయ సంతాప దినాలుగా జరుపుకోవాలని నిర్ణయించడమైనది. ఆమెకు గౌరవంగా ఈ రెండు రోజులూ జాతీయ పతాకాన్ని ప్రభుత్వ కార్యాలయాలపై అవనతం (జెండాకు సగం ఎత్తులోనే పతాకం ఎగురవేసి ఉంచడం) చేయడం జరుగుతుంది’’అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

లతా మంగేష్కర్ భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రభు కుంజ్ లోని ఆమె నివాసం వద్ద ఉంచనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు శివాజీ పార్క్ లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


More Telugu News