దేశంలో మరింతగా తగ్గిన కరోనా కొత్త కేసులు.. తాజా వివరాలు
- నిన్న దేశంలో 1,49,394 కేసులు
- 1,072 మంది కరోనా వల్ల మృతి
- 14,35,569 యాక్టివ్ కేసులు
- మృతుల సంఖ్య మొత్తం 5,00,055
దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. నిన్న దేశంలో 1,49,394 కేసులు నమోదయ్యాయని కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మొన్న నమోదైన కేసుల కంటే నిన్న 13 శాతం తక్కువగా నమోదయ్యాయి. అలాగే, నిన్న 1,072 మంది కరోనా వల్ల మృతి చెందారని, 2,46,674 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 14,35,569 మంది చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది. మృతుల సంఖ్య 5,00,055కు చేరుకుందని వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 9.27 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 168.47 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వేశారు.