కామన్వెల్త్ క్రీడల్లో మరోసారి క్రికెట్ కు చోటు

  • ఈ ఏడాది ఇంగ్లండ్ లో కామన్వెల్త్ క్రీడలు
  • మహిళల క్రికెట్ జట్లతో పోటీలు
  • టీ20 ఫార్మాట్లో పోటీలు
  • ఒకే గ్రూప్ లో దాయాదులు
  • తొలిమ్యాచ్ లో ఆసీస్ తో టీమిండియా ఢీ
అనేక దేశాల్లో జనరంజక క్రీడగా కొనసాగుతున్న క్రికెట్ కు కామన్వెల్త్ క్రీడల్లో మరోసారి స్థానం దక్కింది. ఈ ఏడాది ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ వేదికగా జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ కు కూడా చోటు కల్పించారని ఐసీసీ వెల్లడించింది. మలేసియాలో 1998లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ కు తొలిసారి స్థానం కల్పించారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ కూడా అలరించనుంది.

అయితే ఈ పర్యాయం కేవలం మహిళల జట్లే బరిలో దిగుతాయని ఐసీసీ పేర్కొంది. టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో రెండు గ్రూప్ లు ఉన్నాయి. గ్రూప్-ఏలో టీమిండియా, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, బార్బడోస్ జట్లున్నాయి. గ్రూప్-బిలో శ్రీలంక, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లున్నాయి. జులై 29న జరిగే తొలి మ్యాచ్ లో టీమిండియా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ పోటీలు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో నిర్వహించనున్నారు.


More Telugu News