గడ్డం నెరిసిపోతోంది పెళ్లి చేసుకోమన్న నెటిజెన్ కు... నవదీప్ సెటైరికల్ రిప్లై!
- గడ్డం నెరిస్తే ట్రిమ్ చేసుకోవాలే కానీ పెళ్లి కాదన్న నవదీప్
- దురద పెడితే గోక్కుంటామే కానీ తోలు పీక్కోలేము కదా అంటూ సెటైర్
- 35 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి జోలికి వెళ్లని నవదీప్
చాలామంది సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. అభిమానులతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ అనేక విషయాలను పంచుకుంటుంటారు. ఇలాంటి వారిలో హీరో నవదీప్ కూడా ఒకరు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లో నవదీప్ కూడా ఒకరు. ఒకప్పుడు లవర్ బోయ్ గా పేరు తెచ్చుకున్న నవదీప్ ఆ తర్వాత హీరోగా అవకాశాలను కోల్పోయాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా సినిమాలు చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన వయసు 35 ఏళ్లు. అయినప్పటికీ ఇంతవరకు పెళ్లి జోలికి వెళ్లలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ నెటిజన్ నవదీప్ కు ఓ సూచన చేశాడు. గడ్డం నెరిసిపోతోందని, ఇప్పటికైనా పెళ్లి చేసుకోవాలని సూచించాడు. ఈ సూచనకు నవదీప్ సెటైరికల్ గా సమాధానం ఇచ్చాడు. గడ్డం నెరిసిపోతోంది పెళ్లి చేసుకో అని తనకు కొంత మంది సలహా ఇస్తున్నారని... గడ్డం తెల్లబడితే ట్రిమ్ చేసుకోవాలే కాని పెళ్లి కాదని అన్నాడు. దురద పుడితే గోక్కుంటాం కానీ తోలు పీకేసుకోము కదా? అని సెటైర్ వేశాడు.