టెన్నిస్ స్టార్ జకోవిచ్ వీసాను మళ్లీ రద్దు చేసిన ఆస్ట్రేలియా.. అరెస్ట్ పై వివరణ
- దేశానికి సురక్షితమన్న ప్రధాని మోరిసన్
- ప్రజల త్యాగాలతో వచ్చిన ఫలితాలను కాపాడుకుంటామని కామెంట్
- తమకు ఆరోగ్యం, క్రమశిక్షణ చాలా ముఖ్యమని వెల్లడి
- ఇంతకుమించి ఇప్పుడేం మాట్లాడనన్న మోరిసన్
- శనివారం విచారణకు రావాలంటూ జకోకు ఇమిగ్రేషన్ నోటీసులు
టెన్నిస్ స్టార్ జకోవిచ్ కు ఆస్ట్రేలియా ప్రభుత్వం మరోసారి షాకిచ్చింది. అతడి వీసాను మళ్లీ రద్దు చేసింది. ఈ మేరకు అతడి వీసాను రద్దు చేస్తున్నట్టు ఆ దేశ ఇమిగ్రేషన్ మంత్రి అలెక్స్ హాక్స్ ప్రకటించారు. ప్రజాహితార్థమే జకోవిచ్ వీసాను రద్దు చేస్తున్నామని చెప్పారు. వలస చట్టంలోని 133(సీ)3 సెక్షన్ ప్రకారం ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు. హోం శాఖ, సరిహద్దు భద్రతా దళాలు, జకోవిచ్ ఇచ్చిన వివరాల ఆధారంగానే వీసాను రద్దు చేశామన్నారు.
ఈ క్రమంలో శనివారం విచారణకు రావాల్సిందిగా ఇమిగ్రేషన్ అధికారులు జకోకు నోటీసులు పంపారు. అప్పటి వరకు అరెస్ట్ చేయబోమన్నారు. ఈ నిర్ణయంతో జకోవిచ్ డీపోర్టేషన్ దాదాపు ఖాయమైనట్టేనని అంటున్నారు. మూడేళ్ల పాటు అతడిపై ఆస్ట్రేలియా రాకుండా నిషేధమూ విధించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నిర్ణయంతో 21వ గ్రాండ్ స్లామ్ కొట్టాలన్న జకోవిచ్ కలకు బ్రేక్ పడ్డట్టయింది.
దీనిపై దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ కూడా స్పందించారు. జకోవిచ్ వీసాను రద్దు చేయడం మంచిదేనని, ఆస్ట్రేలియాను అది సురక్షితంగా ఉంచుతుందని అన్నారు. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని జాగ్రత్తగా ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఆరోగ్యం, క్రమశిక్షణ తమకు చాలా ముఖ్యమన్నారు.
అసలు ఈ మహమ్మారి ఆస్ట్రేలియా ప్రజలకు అతిపెద్ద పరీక్షే పెట్టిందన్నారు. అంత కష్టంలోనూ అందరం కలసికట్టుగా ఉండి జీవితాలను, ప్రాణాలను కాపాడుకున్నామన్నారు. అంత కలసికట్టుగా ఉన్నాం కాబట్టే ప్రపంచంలోనే అతి తక్కువ మరణాల రేటును కలిగి ఉన్నామని, వ్యాక్సినేషన్ రేటులోనూ మెరుగ్గా ఉన్నామని, ఆర్థిక వ్యవస్థను బలపరచుకోగలిగామని చెప్పారు.
మహమ్మారి సమయంలో ఆస్ట్రేలియన్లు ఎన్నో త్యాగాలు చేశారని, ఆ త్యాగాల వల్ల దక్కిన ఫలితాలను కాపాడుకోవాల్సిన అవసరం తమపైన ఉందని పేర్కొన్నారు. ఈ కారణాలన్నింటి వల్లే జకోవిచ్ వీసాను మళ్లీ రద్దు చేయాల్సి వచ్చిందన్నారు. సరిహద్దు భద్రతకు సంబంధించి తీసుకుంటున్న కఠినమైన నిర్ణయాల వల్లే ప్రతీ ఆస్ట్రేలియన్ కూడా క్షేమంగా ఉంటున్నారని, కొవిడ్ కు ముందూ.. ఇప్పుడూ అలాగే ఉన్నామని స్పష్టం చేశారు. ప్రస్తుతం జకోవిచ్ విషయంలో న్యాయ విచారణ జరుగుతున్నందున ఇంతకు మించి తానేమీ మాట్లాడలేనని మోరిసన్ పేర్కొన్నారు.
కాగా, ఆస్ట్రేలియన్ ఓపెన్ లో పాల్గొనేందుకు జనవరి 5న జకోవిచ్ మెల్ బోర్న్ కు వచ్చాడు. వ్యాక్సిన్ ఎందుకు వేసుకోలేదో సరైన కారణం చూపలేదని పేర్కొంటూ ఆస్ట్రేలియా ప్రభుత్వం అతడి వీసాను రద్దు చేసింది. శరణార్థులను ఉంచిన ఓ హోటల్ లోనే అతడిని ఉంచింది. ఆస్ట్రేలియా నిర్ణయంపై అతడు కోర్టులో సవాల్ చేశాడు. సోమవారం అతడికి అనుకూలంగా తీర్పు వచ్చింది.
అయితే, డిసెంబర్ 16న కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు జకోవిచ్ తీరు ప్రశ్నలను లేవనెత్తింది. కరోనా ఉన్నా అందరితో కలిసి తిరిగాడని, ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోలేదని, ఎదుటి వారికి ముప్పు కలిగించాడని పేర్కొంటూ ఓ ఫొటో వైరల్ అయింది. దానిపై జకోవిచ్ స్పందించాడు. పబ్లిక్ మీటింగ్ లకు వెళ్లినప్పుడు కరోనా ఉన్నట్టు తనకు తెలియలేదని, ఆ తర్వాతే తెలిసిందని వివరణ ఇచ్చాడు.
మరోపక్క, గత 14 రోజుల్లో ఎక్కడికి ప్రయాణించలేదంటూ తప్పుడు డిక్లరేషన్ ఇచ్చినందుకు మాత్రం క్షమాపణ చెప్పాడు. అది తన సపోర్ట్ స్టాఫ్ చేసిన మానవ తప్పిదమంటూ పేర్కొన్నాడు. అయితే, అవన్నీ పరిగణనలోకి తీసుకునే ఆస్ట్రేలియా ప్రజలకు నష్టమన్న ఉద్దేశంతో జకోవిచ్ వీసాను మళ్లీ రద్దు చేస్తున్నట్టు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది.