హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం.. కృష్ణా జిల్లా వ్యాప్తంగానూ వాన
- హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం
- గత మూడు రోజులుగా తెలంగాణలో వర్షాలు
- మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం
- ఏపీలోని పలు జిల్లాల్లోనూ వర్షాలు
హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. అలాగే, తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. గత మూడు రోజులుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు రైతులు పెద్ద ఎత్తున పంట నష్టపోయారు. అంతేగాక, మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది.
మరోవైపు, ఏపీలోని పలు జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వానలు కురుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతకు నష్టం వచ్చింది. పలు మండలాల్లో పంటలు నేలకొరిగాయి. ముఖ్యంగా మొక్క జొన్న, పత్తి, వరి, పండు మిర్చి పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు చెప్పారు.