మల్టీ స్టారర్ ను లైన్లో పెడుతున్న కోలీవుడ్ స్టార్ బ్రదర్స్!

  • సూర్యకి విపరీతమైన క్రేజ్
  • కార్తికి మంచి ఇమేజ్
  • డిఫరెంట్ కాన్సెప్ట్స్ పట్ల ఆసక్తి
  • త్వరలో తీరనున్న అభిమానుల ముచ్చట
ఒక ఫ్యామిలీలో అన్నదమ్ములు ఇద్దరూ కూడా స్టార్ హీరోలుగా రాణించడం చాలా అరుదు. అలాంటి హీరోల జాబితాలో కోలీవుడ్ నుంచి సూర్య - కార్తి కనిపిస్తారు. ఇద్దరూ కూడా వైవిధ్యానికి ఎంతో ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకూ రొటీన్ కి భిన్నంగా ఉండే కథలను చేయడానికే ఆసక్తిని చూపుతుంటారు.

ప్రస్తుతం ఈ ఇద్దరి చేతిలో ఉన్న సినిమాలన్నీ డిఫరెంట్ జోనర్స్ కి చెందినవే. వారిలోని విలక్షణమైన నటనను ఆవిష్కరించేవే. ఈ ఇద్దరిని ఒకే సినిమాలో .. ఒకే తెరపై చూడాలని చాలా కాలంగా అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరూ కలిసి 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమా తమిళ రీమేక్ లో చేయనున్నట్టు వార్తలు వచ్చాయి.

ఆ తరువాత అందులో నిజం లేదనే వార్తలు వచ్చాయి. అయితే అన్నదమ్ములిద్దరినీ ఒకే కథలో చూడాలనుకునే అభిమానుల ముచ్చట ఈ ఏడాది తీరనున్నట్టు కోలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది. ఒక మల్టీ స్టారర్ ను లైన్లో పెట్టడానికి వాళ్లిద్దరూ గట్టిగానే ప్రయత్నిస్తున్నారట. త్వరలోనే ఎనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు.


More Telugu News