జీవో నెంబర్ 2ని వెనక్కి తీసుకుంటున్నట్టు హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
- సర్పంచులు, సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ జీవో నెంబర్ 2
- ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేసిన సర్పంచులు
- గతంలోనే ఈ జీవోను సస్పెండ్ చేసిన హైకోర్టు
పంచాయతీ సర్పంచులు, సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం గతంలో జీవో నెంబర్ 2ని తీసుకొచ్చింది. ఈ జీవోను సర్పంచులు వ్యతిరేకించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.. కోర్టు విచారణ సందర్భంగా జీవో నెంబర్ 2 పంచాయతీ రాజ్ చట్టానికి విరుద్ధమని సర్పంచులు వాదించారు. ఈ క్రమంలో సదరు జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. అయితే ఈ జీవోపై హైకోర్టులో మరోసారి విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జీవో నెంబర్ 2ని వెనక్కి తీసుకుంటున్నట్టు హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది.