నిన్నటి వరకు దేవుళ్ల విగ్రహాలు.. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం: ఏపీ బీజేపీ నేతల మండిపాటు
- ఎన్టీఆర్ గారి విగ్రహ ధ్వంసం ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం
- దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి
- ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు
గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం, దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఆ చర్యలు సరికావని సీఎం రమేశ్, జీవీఎల్ నరసింహారావు విమర్శించారు.
'గుంటూరు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గిలో తెలుగు జాతి గర్వించగ్గ మహానాయకుడు, అన్న ఎన్టీఆర్ గారి విగ్రహ ధ్వంసం ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి.. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను' అని సీఎం రమేశ్ మండిపడ్డారు.
'దేవీ, దేవతా విగ్రహాల ధ్వంసం తర్వాత స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని పడగొట్టే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మన పల్నాడును అభిమానించి, పల్నాడు పౌరుషాన్ని తెరకెక్కించిన మహానటుడి విగ్రహాన్ని పడగొట్టాలనుకోవటం బాధాకరం. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాను' అని జీవీఎల్ నరసింహారావు అన్నారు.