స్పీకర్ బాక్సులు బద్దలవ్వాల్సిందే... భీమ్లా నాయక్ నుంచి 'లాలా భీమ్లా' డీజే సాంగ్ రిలీజ్

  • పవన్ హీరోగా భీమ్లానాయక్ 
  • సంగీతం సమకూర్చుతున్న తమన్ 
  • ఇప్పటికే లాలా భీమ్లా పాట రిలీజ్
  • తాజాగా డీజే వెర్షన్ ను తీసుకువచ్చిన చిత్రబృందం
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన 'భీమ్లా నాయక్' చిత్రం నుంచి 'లాలా భీమ్లా' పాట డీజే వెర్షన్ విడుదలైంది. 'లాలా భీమ్లా' పాట ఇంతకుముందు రిలీజ్ అయింది. అయితే డీజే మోతలతో పాటను మరింత హుషారెత్తించే విధంగా రీడిజైన్ చేశారు. 'భీమ్లా నాయక్' చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి.

మలయాళ చిత్రానికి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకుడు. ఇందులో పవన్ కల్యాణ్ కు ప్రతినాయకుడిగా రానా ఓ పవర్ ఫుల్ పాత్ర పోషించారు. పవన్ సరసన నిత్యామీనన్ కథానాయిక. కాగా, 'భీమ్లా నాయక్' చిత్రం జనవరి 12న రిలీజ్ కావాల్సి ఉండగా, ఇతర పెద్ద చిత్రాలు కూడా సంక్రాంతి బరిలో ఉండడంతో విడుదల తేదీని ఫిబ్రవరి 25కి వాయిదా వేశారు.


More Telugu News