కోవర్టులపై చిత్తూరు పోలీసులను ఆశ్రయించిన ఎమ్మెల్యే రోజా!

  • జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ను కలిసిన రోజా
  • మంత్రి పేరు చెప్పుకుని వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణ
  • చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే రోజా పార్టీలో కోవర్టులు ఉన్నారంటూ చిత్తూరు జిల్లా పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఇవాళ చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ను కలిశారు. వైసీపీలో కోవర్టులు ఉన్నారంటూ ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

వైసీపీలో ఉంటూ టీడీపీతో జతకలిసిన వారిని క్షమించేది లేదంటూ రోజా స్పష్టం చేశారు. ఫ్లెక్సీల్లో మంత్రి పెద్దిరెడ్డి, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ల ఫొటోలు వేసుకుని అధికారులను కూడా బెదిరిస్తున్నారని రోజా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అటువంటి వారిని చట్టపరంగా శిక్షించాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. గతంలో పార్టీ నుంచి బహిష్కరణకు గురైనవారే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. కోవర్టుల అంశాన్ని మంత్రి పెద్దిరెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లానని రోజా వెల్లడించారు.


More Telugu News